టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్దన్‌

హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్‌కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.

ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, బాజిరెడ్డి గోవర్దన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, గణేశ్‌ గుప్తా తదితరులు హాజరయ్యారు. కాగా , తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి రెండో చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ నిలిచారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/