వేలంపాటలో బండ్లగూడ లడ్డూ టాప్ ..ఏకంగా రూ.41 లక్షలు పలికింది

వినాయకస్వామికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను చాల ప్రాంతాలలో వేలం వేసి వేలంపాటలో అధిక మొత్తాన్ని వెచ్చించి ఆ లడ్డును దక్కించుకుంటుంటారు. ఇక హైదరాబాద్ లో గణేశ్ ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మహోత్సవంలో గణేశ్ లడ్డూల ప్రత్యేకత కూడా ఒక మహాద్భుతమే. అన్ని ఏరియాల్లోను లడ్డు వేలం పాట వేసి భారీ ధర కు దక్కించుకుంటుంటారు. గత ఏడాది కరోనాతో వేలంపాట నిలిచిపోయిన విషయం విధితమే. కాగా ఈయేడు లడ్డూను సొంతం చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపారు. అన్ని పూజలకు ఆది దేవుడైన గణనాథుడి లడ్డూ వేలం ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. వేలంపాటలో మళ్లీ ఈ ఏడాది బండ్లగూడ లడ్డూ టాప్ లో నిలిచింది.

2019లో రూ.18.51 లక్షలు ధర పలుకగా ఈసారి ఏకంగా రూ.41 లక్షల ధర పలికింది. ఈ లడ్డూను రిచ్మండ్ విల్లా సభ్యులు కైవసం చేసుకుని రికార్డును నిలుపుకున్నారు. 4 కిలోల లడ్డు రూ. 41 లక్షల ధర పలకడం విశేషం. రెండో స్థానంలో బాలాపూర్ లడ్డూ ఈసారి రూ.18.90లక్షల ధర పలికింది. ఈ లడ్డూను ఏపీకి చెందిన కడప ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మర్రి శశాంక్రెడ్డిలు భాగస్వాములుగా దక్కించుకున్నారు.

ఆ తర్వాత మై హోమ్ భూజా – 18. 5 లక్షలు
చేవెళ్ల రచ్చబండ – 14.01 లక్షలు
ఉప్పరపల్లి – 11. 11 లక్షలు
వీరాంజనేయ భక్తి సమాజం, బడంగ్ పేట – 10. 50 లక్షలు
వీరభద్ర భక్తి స్వామి సమాజం, మంచిరేవుల – 8. 10 లక్షలు
బౌరంపేట – 7. 2 లక్షలు
సర్దార్ పటేల్ నగర్ – 6. 51 లక్షలు
అత్తాపూర్ – 6. 50 లక్షలు
నవజ్యోతి యువజన సంఘం, మణికొండ – 6. 5 లక్షలకు దక్కించుకున్నారు. ఇవి హైదరాబాద్ నగరంలో భారీ ధరకు వేలం పాట జరిగినా లడ్డులు .