టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు సింధుకు కాంస్యం

వరుస ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన తొలి బ్యాడ్మింటన్ గా ఘనత

pv sindhu wins bronze at Tokyo Olympics
pv sindhu wins bronze at Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన సింధు సెమీఫైనల్లో ఓడి పసిడి పతకానికి దూరమైంది. అయితే కాంస్యం కోసం ఆదివారం నాడు హి బింగ్జియావో(చైనా)తో తలపడిన సింధు.. 21-13, 21-15 తేడాతో నెగ్గింది. ఆరంభం నుంచే ఎటాకింగ్ ఆడి వరుస గేమ్‌లను కైవసం చేసుకుంది. నెట్ గేమ్ వద్ద కొన్ని సార్లు తడబడినా.. ప్రత్యర్థి చైనా ప్లేయర్‌కు ఎక్కడా ఆధిక్యం ఇవ్వలేదు. తాజా విజయంతో కాంస్యం నెగ్గిన సింధు.. వరుస ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఘనత సాధించింది.