వ్యవసాయ పరపతి లక్ష్యం రూ. 15 లక్షల కోట్లు

Minister Nirmala sitaram budget meeting
Minister Nirmala sitaram budget meeting

New Delhi: ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ పరపతి లక్ష్యం 15 లక్షల కోట్ల రూపాయిలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 20 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపులు అందజేస్తామని, బీడు భూముల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు.

స్వచ్ఛ భారత్ మిషన్ కు రూ.12,300కోట్లు

స్వచ్ఛ భారత్ మిషన్ కు రూ.12,300 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  తెలిపారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ… క్షయవ్యాధి నిర్మూలనలో దేశం విజయం సాధించిందన్నారు.

పిపిపి పద్ధతిలో మరిన్ని ఆసుపత్రులు

ఆరోగ్య రంగంలో సమగ్ర పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. పిపిపి పద్ధతిలో మరిన్ని ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తామన్నారు. ప్రధాని జన్‌ ఆరోగ్య యోజనకు 69 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

జల్ జీవన్ మిషన్ కు రూ.11,500కోట్లు

జల్ జీవన్ మిషన్ కు రూ.11,500 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడుతున్నారు. అలాగే టీబీ హరేగా దేశ్ బచేగా పేరుతో క్షయవ్యాధి నివారణకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

వ్యవసాయానికి 2.83 లక్షల కోట్లు

వ్యవసాయానికి 2.83 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. కరువు జిల్లాలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ రంగాభివృద్ధికి 16 సూత్రాల పథకం అమలు చేస్తామన్నారు. 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పిస్తున్నామన్నారు. 20 లక్షల మంది రైతులకు పంపుసెట్లు అందిస్తున్నామన్నారు. మొదటి ప్రాధాన్యాంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, ద్వితీయ ప్రాధాన్యాంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమం, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడమన్నారు.

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6400కోట్లు

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6400కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-2021 బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడుతున్నారు. అలాగే ఓడీఎఫ్ ప్లస్ ద్వారా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

తాజా ‘నాడి వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/