సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటన : ఓ వ్యక్తి వెన్నుముక లభ్యం

సికింద్రాబాద్ లోని నల్లగుట్ట డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షో రూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహాల కోసం గాలింపు చేస్తుండగా ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ లో ఓ వ్యక్తి వెన్నుముక కనిపించింది. దాన్ని కిందకు తీసుకొచ్చిన పోలీసులు గాంధీ హాస్పిటల్కు తరలించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం ఫైర్, క్లూస్ టీం, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు.

గురువారం ఉదయం ఈ షో రూమ్ అగ్ని ప్రమాదానికి గురైంది. దాదాపు 24 గంటల పాటు అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల తో శ్రమిస్తే కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈరోజు కూడా వేడి బాగా ఉండడం తో ఫోమ్ ను ఉపయోగించి లోపలి వెళ్లారు. ఫైర్ సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్లో ఓ మృతదేహానికి సంబంధించి వెన్నెముకను లభించింది. దాన్ని కిందకు తీసుకొచ్చిన పోలీసులు గాంధీ హాస్పిటల్కు తరలించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం ఫైర్, క్లూస్ టీం, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. మిగిలిన ఫ్లోర్లలో వాళ్ల డెడ్ బాడీ దొరికే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో స్టోర్స్ లో పనిచేస్తున్న వసీం, జునైద్, జహీర్ అందులో చిక్కుకుపోయారు. బీహార్కు చెందిన ఈ ముగ్గురు యువకులు ఏడాదిగా స్టోర్స్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.