బిగ్ బాస్ 5 : సరియు వెళ్తూ వెళ్తూ పెద్ద పెద్ద మాటలే అనేసింది

బిగ్ బాస్ 5 : సరియు వెళ్తూ వెళ్తూ పెద్ద పెద్ద మాటలే అనేసింది

ముందు నుండి అనుకున్నట్లే బిగ్ హౌస్ నుండి సరియు ఎలిమినేషన్ అయ్యింది. వెళ్తూ వెళ్తూ హౌస్ సభ్యుల ఫై మాటల తూటాలు పేల్చింది. సరియు ఎలిమినేషన్ కాగానే తట్టుకోలేకపోయిన విశ్వ హౌస్‌ లోపలకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. అటు హమీదాను ఆపడం కూడా ఎవరి తరమూ కాలేదు. ఇక సరయూ చివరిసారిగా విశ్వను పట్టుకుని గట్టిగా ఏడ్చేసి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది.

స్టేజి మీదకు వచ్చిన సరియు ను నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోని ఐదుగురు బెస్ట్ పర్శన్స్ – ఐదుగురు వరెస్ట్ పర్శన్స్ ను చెప్పమనగానే అడుగగా.. ఆమె బెస్ట్ అన్నవాళ్ళలో శ్వేతవర్మ, మానస్, ప్రియాంక, విశ్వ, హమీద లను చెప్పడగా.. ఇక వరెస్ట్ జాబితాలో సిరి, సన్ని, లహరి, షణ్ముఖ్, కాజల్ పేర్లను తెలిపింది. సిరి, షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నుండే ఓ పద్ధతి ప్రకారం కలిసి స్ట్రేటజీ ప్లే చేస్తున్నారని సరయు ఆరోపించింది. సిరిని డైరెక్ట్ గా అటాక్ చేసిన సరయు… సిరిని ముందు పైకి లేపి ఆ తర్వత తాను పైకి రావాలని షణ్ముఖ్ చూస్తున్నాడని చెప్పింది. ఇక సన్నితో గతంలో తానో సినిమాలో నటించానని, అక్కడ ఎదురైన చేదు అనుభవం కారణంగా మనలో ఏదో పెట్టుకుని తనను సన్నీ నామినేట్ చేశాడని సరయు చెప్పుకొచ్చింది.

అలాంటిదేమీ లేదని సన్నీ చెప్తుండగా మధ్యలో అడ్డుపడిన సరయూ.. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ట్రైనర్‌గా నువ్వు నా మీద కోపం పెంచుకున్నావని తెలుసు అంటూ ఊగిపోయింది. అనంతరం లహరి ఫై విరుచుకుపడింది. ‘ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అంత ఈగో ఏంటి? ఆ టోన్‌ మార్చుకో, ఎదగడానికి మనుషులను తొక్కాల్సిన అవసరం లేదు’ అని గట్టిగానే ఇచ్చిపడేసింది. తర్వాత షణ్ముఖ్‌ గురించి చెప్తూ.. అరేయ్‌ ఏంట్రా ఇది? బయటే అనుకుని ఇలా రావొద్దురా! అయినా సిరిని లేపాక నువ్వు లేద్దామని అనుకుంటున్నావా? అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇక కాజల్‌ను కూడా వరస్ట్‌ కంటెస్టెంట్స్‌ లిస్టులో చేర్చిన సరయూ ఆమెను బుర్ర పెట్టి ఆడమని సలహా ఇచ్చింది. మొత్తం మీద సరియు వెళ్తూ వెళ్తూ హౌస్ సభ్యుల ఫై ఓ రేంజ్ లో విరుచుకుపడింది.