విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను.. వైఎస్‌ఆర్‌ వ్యూ పాయింట్‌గా మార్చడంఫై వివాదం

Controversy over conversion of Abdul Kalam view point to YSR view point in Visakhapatnam

ఏపీలో పేర్ల మార్పు కార్యక్రమం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఉన్న పేర్లను తొలగించి, వైఎస్‌ఆర్‌ పేరుతో కొత్త పేర్లు పెడుతుంది ప్రభుత్వం. దీంతో ప్రతిపక్షపార్టీలు , యువత , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను.. వైఎస్‌ఆర్‌ వ్యూ పాయింట్‌గా మార్చడం వివాదాస్పదంగా మారింది. రీసెంట్ గా జీ20 సన్నాహక సదస్సు సందర్భంగా కోట్ల రూపాయలు కేటాయించి వ్యూ పాయింట్‌ను అభివృద్ది చేసింది ప్రభుత్వం. అయితే సీత కొండగా ఉన్న వ్యూ పాయింట్‌ను అప్పట్లో అబ్దుల్ కలాం పేరుగా మార్చారు. ఇప్పుడు వైఎస్సాఆర్‌గా నామకరణం చేయడంపై వివాదస్పదంగా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ అంశంపై ట్వీట్ చేశారు. అబ్దుల్ కలాం పేరును తొలగించి వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చడం బాధాకరం అన్నారు. ఇలా ఆ మహనీయుడు పేరు తీసేయడం అబ్దుల్ కలాంను అవమానించడమేనంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యూ పాయింట్ సీతంకొండ సమీపంలో ఉంటుంది. నిజానికి ఈ వ్యూపాయింట్ ను గతంలో ప్రభుత్వం కాకుండా వైజాగ్ వాలంటీర్స్ అనే స్వచ్చంద సంస్థ అభివృద్ధి చేసినట్లు చెబుతోంది. అబ్దుల్ కలాం పేరు పెట్టి.. వ్యూ పాయింట్‌ను ఓ మాదిరిగా అభివృద్ధి చేశామంటున్నారు. అయితే కలాం పేరు గవర్నమెంట్ శాశ్వతంగా చట్టప్రకారం పెట్టాలని దీనివల్ల అబ్దుల్ కలాం సర్ కి మన వైజాగ్ ప్రజలు శాశ్వత గౌరవం ఇవ్వడానికి అందరి సహకారం మరియు ప్రోత్సాహం కోరుతున్నామని వైజాగ్ వాలంటీర్స్ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సీతకొండ ప్రాంతం ని కలాం వ్యూ పాయింట్ గా పేరు పెట్టి వేల మంది వాలంటీర్స్ ని మోటివేట్ చేశామని, గవర్నమెంట్ శాశ్వతంగా చట్టప్రకారం పెట్టాలని దీనివల్ల అబ్దుల్ కలాం సర్ కి మన వైజాగ్ ప్రజలు శాశ్వత గౌరవం ఇవ్వడానికి మీ అందరి సహకారం కావాలని వైజాగ్ వాలంటీర్లు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు.

మరోపక్క ప్రభుత్వం మాత్రం వాస్తవానికి ఇక్కడ ఉన్న స్థలంలో గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని స్పష్టం చేసింది. వ్యూ పాయింట్‌గా వ్యవహరించేవారు. అంతేగాని అధికారికంగా పేరు పెట్టలేదుని తెలిపింది. తాజాగా జీ-20 సదస్సు కోసం చేపట్టిన నగర సుందరీకరణ పనుల సమయంలో ఇక్కడ వ్యూ పాయింట్ ను అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో తాము అక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.