ముందస్తు ఎన్నికలకు బాబు సిద్ధం..

ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు సిద్ధం చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు నియోజకవర్గాల ఇంచార్జిలతో కలిసి ఆ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలు మరియు స్థానిక నేతల మధ్యన ఉన్న సాన్నిహిత్యాన్ని పెంచడం వంటి వాటిపైన దృష్టి పెట్టారు. ఇలా అన్ని నియోజకవర్గక ఇంచార్జి లతో సమీక్షలను ఆగష్టు కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట చంద్రబాబు. ఆ తర్వాత సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారని సమాచారం.

అధికార పార్టీ వైస్సార్సీపీ సైతం ముందస్తు ఎన్నికలకే మొగ్గుచూపిస్తున్నారు. ఇదే విషయమై ప్రధాని మోడీ తో జగన్ చర్చించారని తెలుస్తుంది. మరోపక్క జనసేన పార్టీ సైతం ఎన్నికలకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ను ఉభయ గోదావరి జిల్లాలో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసాడు. అతి త్వరలో రెండో యాత్ర కూడా మొదలుపెట్టబోతున్నారు. అటు బిజెపి , కాంగ్రెస్ పార్టీలు సైతం ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. పార్టీ లో పలువురికి కీలక పదవులు అప్పగించారు. మరి ఈసారి ప్రజలు ఎవరికీ పట్టం కడతారో చూడాలి.