దేవానంద్‌ సుప్రీంకోర్టు జడ్జిగా ఎదగాలి

హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన బట్టు దేవానంద్‌

Battu Devanand
Battu Devanand

గుడివాడ: ఏపి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ బట్టు దేవానంద్ కు ఆత్మీయ సత్కారం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడలోని స్థానికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి కొడాలి నాని, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దర్శకజనిర్మాత వైవీయస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, గుడివాడకు చెందిన బట్టు దేవానంద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం ఈ ప్రాంతం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం కావూరి సాంబశివరావు మాట్లాడుతూ, చరిత్రలో నిలిచిపోయేలా దేవానంద్ తీర్పులు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని, సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి ఆయన ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/