హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగ‌స్వాముల‌కు శుభ‌వార్త

వాషింగ్టన్: హెచ్‌-1బీ వీసాదారుల‌కు అమెరికాలోని బైడెన్  స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగ‌స్వాముల‌కు ఆటోమెటిక్ వ‌ర్క్ ఆథ‌రైజేష‌న్ అనుమ‌తులు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల వేలాది మంది ఇండో-అమెరిక‌న్ మ‌హిళ‌ల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. వ‌ల‌స‌దారుల జీవిత‌భాగ‌స్వాముల‌ త‌ర‌పున అమెరిక‌న్ ఇమ్మిగ్రేష‌న్ లాయ‌ర్స్ అసోసియేష‌న్ కోర్టులో కేసు దాఖ‌లు చేసింది. దీనిపై హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ సెటిల్మెంట్ కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి హెచ్‌-4 వీసాదారులు ఆటోమెటిక్ ఆథ‌రైజేష‌న్‌కు అర్హులే కానీ, గ‌తంలో వారికి ఆ ల‌బ్ధి చేర‌కుండా ఏజెన్సీ అడ్డుకున్న‌ది. కానీ అలా చేయ‌డం వ‌ల్ల అధిక జీతాలు వ‌చ్చే ఉద్యోగాల‌ను వాళ్లు కోల్పోవాల్సి వ‌స్తోంద‌ని ఇమ్మిగ్రేష‌న్ లాయ‌ర్స్ సంఘం త‌ర‌పున జాన్ వాస్‌డెన్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో వ‌ల‌స‌దారుల భాగ‌స్వాములు ఇమ్మిగ్రేష‌న్స్ లాయ‌ర్స్ సంఘాన్ని ఆశ్ర‌యించారు. హెచ్‌-4 జీవిత భాగ‌స్వాముల‌కు ఊర‌ట క‌ల్పిస్తూ హోంల్యాండ్ సెక్యూర్టీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీని ప‌ట్ల ఏఐఎల్ డైర‌క్ట‌ర్ జెస్సీ బ్లెస్ సంతోషం వ్య‌క్తం చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/