మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో భేటి.. రెజ్ల‌ర్ల అయిదు డిమాండ్

wrestlers-met-with-sports-minister-anurag-thakur-amid-protest

న్యూఢిల్లీః కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ అయిన రెజ్ల‌ర్లు భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్ష ప‌ద‌వికి మ‌హిళా రెజ్ల‌ర్‌ను నియ‌మించాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రికి మొత్తం అయిదు డిమాండ్లు చేశారు. భ‌జ‌రంగ్ పూనియా, సాక్షీ మాలిక్‌లు ఈరోజు ఠాకూర్‌తో భేటీ అయ్యారు. గ‌త కొన్ని రోజుల్లో కేంద్ర ప్ర‌భుత్వంతో రెజ్ల‌ర్లు భేటీ కావ‌డం ఇది రెండ‌వ‌సారి.

రెజ్లింగ్ స‌మాఖ్య‌కు స్వేచ్ఛ‌గా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని రెజ్ల‌ర్లు కోరారు. బ్రిజ్ భూష‌ణ్‌తో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు దీంట్లో భాగ‌స్వామ్యం కారాదు అని కోరారు. పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వం రోజున న‌మోదు అయిన కేసును కొట్టివేయాల‌ని కోరారు. బ్రిజ్‌ను అరెస్టు చేయాల్సిందే అన్నారు. కేంద్ర మంత్రి ఠాకూర్‌తో జ‌రిగిన భేటీకి వినేశ్ పోగ‌ట్ హాజ‌రుకాలేదు.