మళ్లీ ఘాటైన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు

అయ్యన్నపాత్రుడు ఎక్కడ తగ్గడం లేదు. గురువారం ఈయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు శుక్రవారం అందోళన చేపట్టారు. చంద్రబాబు క్షపాపణ చెప్పలని డిమాండ్ చేస్తూ..చంద్రబాబు ఇంటిపైకి వెళ్లడం తో అక్కడ టీడీపీ కార్యకర్తలకు – వైసీపీ నేతలకు కార్యకర్తలకు మధ్య గొడవ అయ్యింది. ఆ తర్వాత కూడా అయ్యన్న ఘాటైన వ్యాఖ్యలే చేసారు.పిచ్చి పరిపాలన చేసేవాడిని పిచ్చి తుగ్లక్‌ అని కాకుండా ఏమంటారు..? రైతుల సమస్యలపై మాట్లాడితే దౌర్జన్యం చేస్తారా..? అంటూ మండిపడ్డారు. జగన్‌పై అభిమానం ఉంటే ఆయనకు సేవ చేసుకోండి.. కానీ, శవాలపై చిల్లర పైసలు ఏరుకునే జోగి రమేష్‌.. చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు.

చెత్తపై పన్ను వేసినవారిని చెత్త పాలన అంటే తప్పా..? నిరంతరం బూతులు మాట్లాడే మంత్రిని బూతుల మంత్రి అనడం తప్పా..? అంటూ నేతలను , ముఖ్యమంత్రి ని మళ్లీ కామెంట్స్ చేసారు. ఎమ్మెల్యే జోగి రమేష్ 24 గంటల ముందే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని, బహిరంగంగా చెప్పినా బందోబస్తు చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు నిదర్శనమన్నారు. చంద్రబాబును హత్యచేసేందుకు కుట్ర పన్నుతున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు.

కన్నబాబు రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. సన్న బియ్యం అంటే ఏమిటో తెలియని బూతుల మంత్రి.. కొడాలి నాని పౌరసరఫరాల మంత్రిగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టమని అన్నారు. మరి ఈ వ్యాఖ్యల ఫై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.