‘డేగల బాబ్జీ’ గా బండ్ల గణేష్

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ..‘డేగల బాబ్జీ’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన బండ్ల గణేష్..అతి కొద్దీ సమయంలోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు. పవన్ కళ్యాణ్ , రవితేజ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్న మూవీ లో బండ్ల గణేష్ హీరోగా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ కి ‘డేగల బాబ్జీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ లుక్ లో బండ్ల గణేష్ తలపై బ్లేడ్‌తో కట్ చేసినట్టు లుక్‌ను డిజైన్ చేసారు.

ఈ నెల ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తమిళంలో హిట్ అయిన ‘ఓత్త సెరుప్పు సైజ్ 7’కి‌ రీమేక్ ఇది. తమిళంలో పార్తిబన్ చేసిన పాత్రను బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం పత్యేకంగా మేకోవర్ అయ్యాడు గణేశ్. ఇక ఈ మూవీ గణేష్ కు భారీ హిట్ ఇవ్వాలని కోరుకుందాం.