జనవరి 22న మద్యం దుకాణాలు బంద్‌

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న మద్యం దుకాణాలు బంద్‌ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ రోజున రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలతో పాటు ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండబోవని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే ప్రభుత్వ భవనాలను అలంకరించడంతో పాటు బాణా సంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

అయోధ్యలో జనవరి 14 నుంచి పరిశుభ్రతపై ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పవిత్రోత్సవ వేడుకల సన్నాహకాల్లో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరించి చెప్పారు. ఇక వేడుకను చూసేందుకు తరలివచ్చే వీవీఐపీల విశ్రాంతి స్థలాలను ముందుగానే నిర్ణయించాలని, వేడుకలను సజావుగా వ్యవస్థీకృతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.