ఢిల్లీ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Delhi congress party manifesto
Delhi congress party manifesto

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 5 వేల నుంచి 7,500 వరకు అందిస్తామని అందులో పేర్కొంది. అంతేకాకుండా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, వాయు కాలుష్యం నివారణ, రవాణా సదుపాయాల అభివృద్ధి, యువ స్వాభిమాన్‌ యోజన కింద డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ. 5వేలు, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి రూ. 7,500 అందజేస్తామని తెలిపింది. రూ.15కే భోజనం అందించే విధంగా ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పేర్కొంది. సిఏఏపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని, ఎన్‌ఆర్‌సి అమలు చేయమని, ఎన్‌పిఆర్‌ను తీసుకురాబోమని ఢిల్లీ కాంగ్రెస్‌ ఛీఫ్‌ సుభాష్‌ చోప్రా వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/