బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది అధిష్టానం. 8 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. అయితే ఈ 16 మంది లో తెలుగు అభ్యర్థులను ప్రకటించలేదు. కర్నాటక నుంచి మరోసారి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇవ్వగా.. మహారాష్ట్ర నుంచి పీయూష్‌ గోయల్‌, మధ్యప్రదేశ్‌ నుంచి కవితా పటిదార్‌, ఉత్తరాఖండ్‌ నుంచి కల్పనా సైనీకి అవకాశం ఇచ్చింది.

ఇక జగ్గేష్‌కు కర్ణాటక, రాజస్థాన్ ఘన్‌శ్యామ్ తివారీలకు అవకాశం కల్పించారు. ఇక ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మీకాంత్‌ వాజ్‌పేయీ, రాధామోహన్‌ అగర్వాల్‌, సురేంద్రసింగ్‌ నగర్‌, బాబురామ్‌ నిషద్‌, దర్శన సింగ్‌, సంగీతా యాదవ్‌‌లు ఉన్నారు. బీహార్‌ నుంచి సతీష్‌ చంద్ర దూబేకు.. హర్యానా నుంచి కిషన్‌ లాల్‌ పన్వార్‌కు అవకాశం దక్కింది. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి.