బిఆర్‌ఎస్‌కు వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా

ఏ పార్టీలో చేరుతామనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడి

vikarabad-municipal-chairperson-resigns-to-brs

హైదరాబాద్‌ః అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలకు జంపింగ్ ల బెడద ఎక్కువవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాడా పార్టీలు మారుతుండటం పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. రాష్ట్రంలో అధికార బిఆర్ఎస్ పార్టీకి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు పలువురు కాంగ్రెస్, బిజెపిల్లో చేరారు. తాజాగా బిఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ మంజుల, ఆమె భర్త బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. వీరితో పాటు వీరు అనుచరులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు కౌన్సిలర్ గా మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త రమేశ్ కీలక పాత్రను పోషించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు, వీరికి మధ్య కాలక్రమంలో రాజకీయ వైరం పెరిగింది. ఈ క్రమంలో వారు పార్టీని వీడారు. ఏ పార్టీలో చేరుతామనేది త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు.