బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌పై అరెస్ట్ వారెంట్

bandla ganesh
bandla ganesh

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్ట్ షాక్ ఇచ్చింది. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేష్‌ ఇచ్చిన 1.25 కోట్ల చెక్కు బౌన్స్‌ అయింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ బండ్ల గణేష్ స్పందిచలేదు. దీంతో ఈరోజు అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపర్చాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. దీంతో బండ్ల గణేశ్ ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఎదుట మధ్యాహ్నం హాజరయ్యారు.

ఇక బండ్ల గణేష్ ఫై గతంలో కూడా ఓ కేసు నమోదైంది. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర రూ.13 కోట్లు తీసుకున్నారట. అయితే తిరిగి చెల్లించకపోవడంతో.. బండ్ల గణేష్‌పై కడపలో మహేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కోర్టు విచారణకు బండ్ల గణేష్ హాజరు కాకపోవడంతో.. ఆయనపై అప్పట్లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు కడప మెజిస్ట్రేట్. అనంతరం బండ్లను అరెస్ట్ చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో జరిగింది.