వైస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్ పునరుద్ధరణ

వైస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్ పునరుద్ధరణ జరిగింది. రీసెంట్ గా వైస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసారు నేరగాళ్లు. ట్విట్టర్ ప్రొఫైల్ , అలాగే కవర్ ఫోటోను మార్చేశారు. అధికార పార్టీ వైస్సార్సీపీ కి ఎలాంటి సంబంధం లేని కృప కమ్యూనిటీ పోస్టులను రీట్వీట్ చేయడం , ప్రొఫైల్ పిక్ లో కోతి బొమ్మ పెట్టడం చేసారు. శుక్రవారం అర్ధరాత్రి హ్యాకింగ్ ను గుర్తించిన వైస్సార్సీపీ సాంకేతిక బృందం వెంటనే ట్విట్టర్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ కు సమాచారం అందించింది.

వెంటనే రంగంలోకి దిగిన టెక్నీకల్ టీమ్ ట్విట్టర్ టీమ్ ఆదివారం ఖాతాను పునరుద్ధరించింది. హ్యాకింగ్ అనంతరం వైస్సార్సీపీ తొలి ట్వీట్ చేసింది. “గతంలో ఎన్నడూ లేని విధంగా మా ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. గత 36 గంటలుగా మా ట్విట్టర్ ఖాతా మా అధీనంలో లేదు. ఇప్పుడు మా ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించారు. ఈ సహాయానికి ట్విట్టర్ మద్దతు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం” అని ట్వీట్ చేసింది.