కాంతార మూవీ ఫై రాజమౌళి కామెంట్స్

కాంతార మూవీ ఫై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. కేవలం రూ.16 కోట్లతో కన్నడ లో తెరకెక్కిన కాంతార..వరల్డ్ వైడ్ గా 50 రోజుల్లో రూ.600 కోట్లు కలెక్ట్ చేసి..రికార్డు బ్రేక్ చేసింది. కథ లో దమ్ము ఉండాలి కానీ బడ్జెట్ , కాస్ట్ & క్రూ తో సంబంధం లేదని నిరూపించింది. ఇక ఇప్పటికే ఈ మూవీ ఫై ఎంతో మంది సినీ , రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా..తాజాగా రాజమౌళి స్పందించారు.

తాజాగా గా ఓ బాలీవుడ్ మీడియా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ కాంతార సినిమాపై ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. కాంతార మ‌న మైండ్ సెట్‌ను పూర్తిగా మార్చేసింది. భారీ క‌లెక్ష‌న్స్ సాధించాలంటే భారీ స్టార్స్‌, బ‌డ్జెట్ అవ‌స‌రం లేద‌ని కాంతార ప్రూవ్ చేసింది. ఫిల్మ్ మేక‌ర్స్‌గా అస‌లు మ‌నం ఏం చేస్తున్నాం అనే విష‌యాన్ని మ‌రోసారి చెక్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని జ‌క్క‌న్న తెలిపారు. రాజ‌మౌళి చేసిన ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.