బైడెన్ ఫైట్ ఫండ్‌కు 5 డాలర్ల విరాళమివ్వగలరా?
డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ట్వీట్

Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగకుండా ట్రంప్ కోర్టుకు వెళ్తానంటూ బెదిరించారని డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హ్యారిస్ ట్వీట్ చేశారు.
ఆయనపై తిరిగి పోరాడేందుకు తమ క్యాంపెయిన్ రెడీగా ఉందని పేర్కొన్నారు
మా పని కొన్ని వారాలపాటు సాగవచ్చని, అందుకే బైడెన్ ఫైట్ ఫండ్‌కు5 డాలర్లు విరాళమివ్వగలరా అని ట్వీట్‌చేశారు.
ఇదిలా ఉండగా, డెమోక్రాట్లు దొడ్డిదారిన ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటూ ట్రంప్ క్యాంపెయిన్ తమ మద్దతుదారులను మెయిల్స్‌ద్వారా విరాళాలను సేకరించే పనిలో నిమగ్నమవ్వటం విశేషం.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/