వివేకా హత్య కేసు.. అభిషేక్ రెడ్డి వాంగ్మూలం నమోదు

అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాశ్‍రెడ్డి పెదనాన్న మనవడు అభిషేక్ రెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు తీసుకున్నారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లి చూశానని.. బెడ్‍ రూమ్‍లో మంచం చుట్టూ రక్తం, బాత్‍రూం లో మృత దేహం ఉందని అభిషేక్ రెడ్డి సిబిఐ అధికారులకు చెప్పాడు. వివేకా నుదుటిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని.. వరండాలో అవినాశ్‍రెడ్డి ఫోన్లో మాట్లాడుతున్నారని తెలిపాడు. శివ శంకర్ రెడ్డి, మనోహర్‍రెడ్డి, రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెప్పాడు. కానీ గుండెపోటుతో మరణించాడని టీవీల్లో వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. వైఎస్ వివేకా నంద రెడ్డిని చంపేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా.. గుండె పోటు అని ఎందుకు ప్రచారం చేశారో తనకు అర్థం కాలేదని అభిషేక్ రెడ్డి.. సీబీఐ అధికారులకు వివరించాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/