బిటెక్ విద్యార్థిని – ఆటో డ్రైవర్ మధ్య ప్రేమాయణం..చివర్లో సరికొత్త ట్విస్ట్

ప్రేమకు వయసు , కులాలతో సంబంధం లేదు. ప్రేమ ఎప్పుడైనా..ఎక్కడయినా..ఎలాగైనా పుడుతుంది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఓ ఆటో డ్రైవర్ , బీటిక్ విద్యార్థిని మధ్య లాగే పుట్టింది. ప్రతి రోజు ఆమె ఆటో ఎక్కుతూ కాలేజీ కి వెళ్ళేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆలా రెండేళ్ల పాటు ఇద్దరు విచ్చలవిడిగా తిరిగారు. ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం తో సదరు యువతీ అతడు ఎప్పడు రమ్మంటే..ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళింది.

తీరా పెళ్లి చేసుకొమ్మని సదరు యువతీ అడగడం తో అతడు ముఖం చాటేయడం చేసాడు. ఫోన్ లెఫ్ట్ చేయకపోవడం , కనిపించకుండా తిరగడం చేయడం మొదలుపెట్టాడు. దీంతో సదరు యువతీ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్నీ వివరంగా చెప్పి న్యాయం చేయాలనీ కోరింది. యువతీ నుండి పిర్యాదు తీసుకున్న పోలీసులు సదరు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.