నీట మునిగిన రాజంపేట

వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. డ్యామ్ లు , చెరువులు , వాగులు , వంకలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువుల ఆనకట్టలు తెగిపోవడం తో ఆ నీరంతా ఊర్లల్లోకి వస్తున్నాయి. రాజంపేట పూర్తిగా నీట మునిగింది. మరోపక్క భారీ వర్షాలు పడుతుండడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ,,అత్యవసర సమావేశం ఏర్పటు చేసారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్‌కు నివేదిస్తారు.

ఇక వాయుగుండం ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా కోస్తా భాగాల్లో పాటు విశాఖపట్టణం, విజయనగరంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే.. తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తిరుమల వీడులతోపాటు తిరుపతిలోని అనేక ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజుల పాటు శ్రీవారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.