తెలంగాణపై స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం

తెలంగాణపై స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం
heavy-rains

హైదరాబాద్‌: తెలంగాణ‌పై వాయుగుండం స్థిరంగా కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో రెండు, మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని గుల్బ‌ర్గాకు 80 కిలోమీట‌ర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృత‌మైంది. ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా 25 కి.మీ. వేగంతో వాయుగుండం క‌దులుతోంది. సాయంత్రానికి క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డి అల్ప‌పీడ‌న ప్రాంతంగా మారే సూచ‌న ఉంది. వాయుగుండం ప్ర‌భావంతో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. తెలంగాణ‌లో అనేక చోట్ల 20 సెం.మీ. పైగా వ‌ర్ష‌పాతం న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. వాయుగుండం ప్ర‌భావంతో రేప‌ట్నుంచి క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌, గోవాకు భారీ వ‌ర్ష సూచ‌న ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు‌. ప‌శ్చిమ వాయ‌వ్యంగా క‌దులుతూ అరేబియా స‌ముద్రంపైకి వెళ్తున్న‌ట్లు అంచనా వేశారు. ఎల్లుండి మ‌ళ్లీ అల్ప‌పీడ‌న ప్రాంతం వాయుగుండంగా మారే అవ‌కాశం ఉంది. ఈశాన్య దిశ‌గా క‌దులుతూ మ‌హారాష్ర్ట గుజ‌రాత్‌కు ద‌క్షిణంగా తీరం దాటే అవ‌కాశం ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/