ఎల్బీనగర్‌లో దారుణం..మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

హైదరాబాద్ లో మహిళలకు రక్షణ లేకుండాపోతుంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వ చట్టాలకు , పోలీసులకు , కోర్ట్ శిక్షలకు ఏమాత్రం భయపడడం లేదు. గత వారం రోజుల వ్యవధిలో దాదాపు ఆరు , ఏడు అత్యాచార ఘటనలు నమోదు అయ్యాయి. ఈ ఘటనలన్నీ కూడా మైనర్ బాలిక ఫై జరిగిన అత్యాచారాలే. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన వార్తల్లో నిలుస్తుండగానే మరికొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజాగా ఎల్బీ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ ఆటో డ్రైవర్ మూడు రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సలీమ్.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన పక్కింట్లో ఉన్న మైనర్ బాలికపై గత మూడు రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయాన్ని బాధితురాలు తన తల్లితో చెప్పడంతో ఆమె ఎల్బీనగర్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సలీమ్‌ను అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు.