ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా 1,546 కేసులు

24 గంటల్లో 18 మంది మృత్యువాత

Covid Tests-
Covid Tests-

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ లో గడిచిన 24 గంటల్లో 69,606 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 13,428 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,940 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,37,956 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 20,170 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,71,554 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు  2,47,78,146 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/