ప్రగతి భవన్‌లో జాతీయజెండా ఎగురవేసిన సిఎం కెసిఆర్‌

cm-kcr-hoists-national-flag-in-pragathi-bhavan

హైదరాబాద్ః 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సీఎం కెసిఆర్ ప్రగతిభవన్‌లో జాతీయజెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం అంబేడ్కర్, మహాత్మాగాంధీ మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కెసిఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాజరైన సీఎం కెసిఆర్.. పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలోనే వీరుల సైనిక స్మారకం దగ్గర సర్వమత ప్రార్థనలు చేశారు. త్రివిధ దళ అధికారులు కూడా పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి నివాళులర్పించారు

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/