ట్రంప్‌ సమావేశంలో పాల్గొన్న వ్యక్తికి కరోనా

Donald Trump
Donald Trump

అమెరికా: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రభావం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై పడింది. ట్రంప్ పాల్గొన్న ఉన్నత స్థాయి సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దాంతో, శ్వేత సౌథం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో గత నెల చివరి వారంలో ఖది కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్గను నిర్వహించారు. దీనికి అమెరికా అధ్యక్షడు డొనాల్డ్, ఉపాధ్యక్షుడు మైక్ పెప్స్‌తో పాటు క్యాబినెట్ సభ్యులు, శ్వేతసౌథం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ కావడం అలజడి సృష్టించింది. అయితే, బాధిత వ్యక్తి ట్రంప్, పెన్స్‌ను కలువలేదని గుర్తించడంతో అధికారులు ఊపిరిపీల్చుచుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/