పవన్ కళ్యాణ్ ప్రసంగం ఫై పేర్ని నాని కామెంట్స్

అంత భావించినట్లే పవన్ కళ్యాణ్ ప్రసంగంపై వైస్సార్సీపీ మాజీ మంత్రి , ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ సభ పెట్టిన..ఏ ప్రసంగం చేసిన మొదటిగా వైస్సార్సీపీ నుండి స్పందించేది పేర్ని నానినే. ఇప్పుడు కూడా అలాగే ముందుగా తన స్పందనను తెలియజేసారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ మంగళవారం మచిలీపట్నం లో ఎంతో గ్రాండ్ గా జరుపుకుంది. లక్షలాది మంది జనసేన శ్రేణులు , కార్య కర్తలు, అభిమానులు, ప్రజలు సభకు తరలివచ్చారు. అలాగే పవన్ ర్యాలీ లో కూడా వేలాదిమంది పాల్గొన్నారు.

ఇక సభలో పవన్ కళ్యాణ్ అనేక అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏంచేస్తుందో తెలిపారు. అలాగే పొత్తులపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్ ప్రసంగం ఫై పేర్ని నాని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తీయటి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. చంద్రబాబు మేలుకోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అసత్యాలు మాట్లాడుతూ ఆయన నిస్సిగ్గుగా కుల రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. జనసేన అసలు రాజకీయ పార్టీనేనా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ – చంద్రబాబును విడివిడిగా కాదు.. కలిసి రావాలని సవాల్ విసిరారు. అందరినీ చితక్కొట్టి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ముసుగు తీసినందుకు సంతోషం అన్నారు.