పార్టీ మారడం ఫై మాగంటి బాబు క్లారిటీ

ఏలూరు ఎంపీ టికెట్ పుట్టా మహేశ్ యాదవ్కు దక్కడంతో అసంతృప్తిగా ఉన్న మాగంటి బాబు..టీడీపీ ని వీడి వైసీపీ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఫై మాగంటి క్లారిటీ ఇచ్చారు. ‘గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను పార్టీ మారతాననే వార్తలను నమ్మొద్దు. వ్యక్తిగత పనులపై హైదరాబాద్లో ఉండటంతో క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లేను. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన నాకు లేదు’ అని మాగంటి బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ తో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎన్నికలు సమీపితున్న తరుణంలో కూటమి పార్టీలకు షాకులు తప్పడం లేదు. పొత్తులో భాగంగా టిడిపి , జనసేన పార్టీలు చాల స్థానాలలో తమ అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వలేకపోయాయి. కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు , మరికొన్ని చోట్లా టిడిపి అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వడం తో..ఇంతకాలం పనిచేసిన మాకు టికెట్స్ ఇవ్వరా అంటూ వరుసపెట్టి నేతలు రాజీనామా చేస్తూ..మరో పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ లో చేరగా ..ఇప్పుడు మాగంటి బాబు కూడా టీడీపీని వీడితే ఎలా అని ఆయన వర్గీయులు మాట్లాడుకున్నారు. కానీ పార్టీ మారడం లేదని క్లారిటీ ఇవ్వడం తో హమ్మయ్య అనుకుంటున్నారు.