నగరంలో అందుబాటులోకి రాబోతున్న మరో ఫ్లైఓవర్

హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం – GHMC తో కలిసి అనేక ఫ్లైఓవర్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే నగరంలో అనేక ఫ్లైఓవర్ అందుబాటులకి రాగా..తాజాగా మరో ఫ్లైఓవర్ వచ్చే వారం నుండి అందుబాటులోకి రాబోతుంది.

వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్‌ వైపు వచ్చే దారిలో ఎల్బీనగర్‌ కూడలిలో కుడివైపు నిర్మితమైన వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. 22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్లు వెడల్పుతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ నెల 13న టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 16న కౌంటింగ్‌ జరగనుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మార్చి 18 తర్వాత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ క్ సమస్యలు, సిగ్నల్ లేని ప్రయాణం సాగించేలా కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఐటీ కారిడార్ కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్ పాస్ లను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కొత్త కారిడార్ తో ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసే వీలు ఉంటుంది. అయితే గచ్చిబౌలి జంక్షన్ నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆల్విన్ కాలనీ, మాదాపూర్ ప్రాంతాలకు ఈ ఫ్లైఓవర్ మీది నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించవచ్చు.