నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ టీజర్ విడుదల

naresh-pavitras-malli-pelli-movie-teaser-released

సీనియర్ నటుడు నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తాలూకా టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో గత కొద్దీ రోజులుగా నరేష్ లైఫ్ లో ఏంజరుగుతుందో అదే టీజర్ లో చూపించారు. నరేష్ – పవిత్రతో తిరగడం, నరేష్ మూడో భార్య మీడియా ముందుకి వెళ్లడం, నరేష్ – పవిత్ర హోటల్ లో ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం.. ఇలా నరేష్ రియల్ లైఫ్ లో జరిగిన సన్నివేశాలన్నీ టీజర్ లో చూపించారు. దీంతో ఈ టీజర్ చూసిన వాళ్ళు నరేష్ – పవిత్రల రియల్ స్టోరీనే సినిమాగా తీస్తున్నారని భావిస్తున్నారు.

ఈ సినిమాలో నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. ఈ టీజర్ చూసిన చాలా మంది ‘నరాలు తెగిపోయాయి.. ఇదేం ట్విస్ట్ బాబోయ్’ అంటూ యూట్యూబ్‌లో కామెంట్లు పెడుతున్నారు. తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నరేష్. ఆయన తల్లి స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై తానే నిర్మాతగా ఈ సినిమాను నరేష్ నిర్మిస్తున్నారు. ఈ మళ్ళీ పెళ్లి సినిమాని ప్రముఖ దర్శక, నిర్మాత MS రాజు డైరెక్ట్ చేస్తున్నారు. సురేష్ బొమ్మిలి సంగీతం సమకూర్చారు. తమపై అల్లుకున్న వివాదం, తమ బంధం గురించి ఈ సినిమా ద్వారా నరేష్, పవిత్ర గట్టిగా చెప్పబోతున్నట్టున్నారు.

YouTube video