వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ పై .. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఎంజీఎం హాస్పటిల్ లో కాసు రాములు అనే పేషెంట్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే నిర్లక్ష్యం, బాధ్యతరహిత్యమే కారణమని ఆరోపిస్తూ లంబాడీ.. గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి.

ఆసుపత్రిలో సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నుండి అనుమతులు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంజక్షన్లు వికటించడం వల్లే బాధితుడు మృతి చెందారని మృతుని బంధువులు రోడ్డెక్కారు. లంబాడి కులస్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. సూపరింటెండెంట్ కులం పేరుతో దూషించారు. కులం పేరుతో సూపరింటెండెంట్ దూషించారని గుగులోతు తిరుపతి మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాక్టర్ చంద్రశేఖర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్నారు.