తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధర ..

తెలుగు రాష్ట్రాల మహిళలకు గుడ్ న్యూస్. గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. కానీ వెండి ధర మాత్రం పెరిగింది.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.120 వరకు తగ్గి రూ.48,630కు చేరింది. కేజీ వెండి ధర రూ.65,339 గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.48,630గా ఉండగా.. కిలో వెండి ధర రూ.65,339గా ఉంది.
  • ఇక వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,630గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,339గా కొనసాగుతోంది.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో రూ.47,500 వద్ద ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఈ నాలుగు సెషన్‌లలో దాదాపు రూ.400 వరకు తగ్గింది. వరుస సెషన్‌లలో బంగారం క్షీణిస్తోంది. నేడు (గురువారం సెప్టెంబర్ 2) గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గింది. ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9.00 (-0.02%) తగ్గి రూ.47,059 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.3.00 (-0.01%) తగ్గి రూ.47213.00 వద్ద ట్రేడ్ అయింది. ఈ వారం ప్రారంభంలో రూ.63,000 దిగువన ట్రేడ్ అయిన పసిడి ఈ నాలుగు సెషన్‌లలో రూ.500కు పైగా పెరిగింది.