భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వి షేప్‌ రికవరీ

రిజర్వు బ్యాంకు స్పష్టీకరణ

economy is in V-shape recovery
economy is in V-shape recovery

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో వి షేప్‌ రికవరీ కనిపిస్తోందని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పేర్కొంది. దేశీయకార్యకలాపాలు క్రమంగా కరోనా ముందుస్థాయికి వస్తున్నాయని, ఫీనిక్స్‌ తరహా రికవరీ భారత ఎకానమీలో కనిపిస్తోందని తెలిపింది.

ఇటీవల కేంద్ర బ్యాంకు రిపోర్ట్‌ వచ్చింది. దీని ప్రకారం కార్యకలాపాలు క్రమంగా పుంజుకుం టున్నాయి. 2021లో వి షేప్‌ రికవరీ ఉంటుందని తెలిపింది. ఇప్పటికే భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినైజేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది.

ఏడాది చివరి నాటికి 300 మిలియన్ల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించనుంది. కరోనా తగ్గు ముఖం పట్టడం, వ్యాక్సినైజేషన్‌ ప్రారంభం కావ డం నేపథ్యంలో మరోసారి కరోనా విజృంభించే అంశంపై ఆర్‌బిఐ స్పందించింది. భారత్‌కు మరో సారి భారీ ప్రమాదం లేదని అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు భారత ఆర్థిక రికవరీ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా భారత్‌కు ఆర్థిక, మానవ విపత్తు ఏర్ప డిందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్‌ పడిపోవడంతో ఇప్పటికే నాలుగింట ఒక వంతు కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని వెల్లడించింది.

భారత జిడిపి 2020-21 మొదటి త్రైమాసికంలో మైనస్‌ 23.9శాతంగా నమోదయిన విషయం విదితమే. రెండో త్రైమాసికంలో ఇది 7.5శాతంగా ఉంది. కరోనా వంటి పెను సంక్షోభం సమయంలో భారత్‌ చర్యలు ప్రపంచం మెచ్చుకునేలా ఉన్నాయి. వ్యాక్సిన్‌ నేపథ్యంలో భారత్‌ వి షేప్‌ రికవరీ ఉంటుందని ఆర్‌బిఐ నివేదిక తెలిపింది.

ప్రభుత్వం ఖర్చులు ఏడాది ప్రాతి పదికన నవంబర్‌ నెలలో 48.3శాతం పెరి గాయి. భారత ఎగుమతులు, దిగుమతులు కూడా క్రమంగా ప్రీకోవిడ్‌ స్థాయికి వస్తు న్నాయి. వరుసగా 9నెలలపాటు ప్రభావం పడింది.

ఏప్రిల్లో ఎగుమతులు జిరో కాగా, మేనెలలో అతి స్వల్పం గా 2 రంగాలు వృద్ధి సాధిం చాయి. ఆ తర్వాత వరు సగా డిసెంబర్‌ నాటికి 20 రంగాలు వృద్ధిని సాధించాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/