ఆరోగ్య మంత్రిని డిస్మిస్ చేసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

కాంట్రాక్టర్ల నుంచి ఒక శాతం కమిషన్ డిమాండ్ చేసిన వైనం
స్పష్టమైన ఆధారాలు లభించడంతో డిస్మిస్ చేసిన సీఎం

న్యూఢిల్లీ : అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంతకు ముందే హెచ్చరించారు. చెప్పినట్టుగానే ఒక అవినీతి మంత్రిపై వేటు వేశారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజ‌య్ సింగ్లా ను ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న‌పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతోనే మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తున్నట్లు సీఎం కార్యాల‌యం ప్ర‌క‌టించింది. ఇక‌.. ఆయ‌న్ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని సీఎం ఆదేశించిన‌ట్లు సీఎంఓ పేర్కొంది.

మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై త‌మ‌వ‌ద్ద స‌మాచారం వుంద‌ని, వాటిపై విచార‌ణ కూడా చేయిస్తామ‌ని సీఎం మాన్ తేల్చి చెప్పారు. ఈ మేర‌కు పంజాబ్ సీఎంవో మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా పై అవినీతి ఆరోప‌ణ‌లు వున్నాయి. కాంట్రాక్టుల విష‌యంలో ఒక్క ప‌ర్సెంట్ క‌మిష‌న్ ఇవ్వాలంటూ డిమాండ్లు చేశార‌ని, ప‌క్కా ఆధారాలు త‌మ వ‌ద్ద వున్నామ‌ని సీఎంవో పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/