అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూత..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతి (90) వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ఆదివారం 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న అచ్చెన్నాయుడికి తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కళావతి మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు పార్టీ నేతలు, జిల్లాకు చెందిన సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కళావతమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. పెద్ద కొడుకు ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 12 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు కన్నుమూశారు. రెండో కొడుకు హరివరప్రసాద్ కోటబొమ్మాళిలో పీఏసీఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మూడో కొడుకు ప్రభాకర్ పోలీస్ శాఖలో డీఎస్పీగా కొనసాగుతుండగా.. అచ్నెన్న టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.