మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన

జనసేన పార్టీ మరో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించింది. విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్సీ అయినా వంశీ..డిసెంబర్ నెలలో జనసేన లో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భాంగా పవన్ కళ్యాణ్ వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న వస్తున్న ఆయన్ను విశాఖ సౌత్ నుండి బరిలోకి దింపుతున్నారు.

వంశీకృష్ణ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అదే ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2011లో వైసీపీ లో చేరి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ వచ్చాడు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తరువాత పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా నియమితుడై పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2019లో టికెట్ దక్కలేదు. 2021లో మహా విశాఖ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 21వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచాడు. ఆయనను విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 12 నవంబర్ 2021న వైసీపీ ప్రకటించింది. ఇక 2023 డిసెంబర్ 27న వైసీపీకి రాజీనామా చేసి జనసేన లో చేరారు.