జగన్ ఒంటరి పురుష పెన్షన్ అప్లై చేసుకోవాలి – అచ్చెన్నాయుడు

ఏపీ సీఎం జగన్ కామెంట్స్ ఫై టీడీపీ నేత అచ్చెన్నాయుడు స్పందించారు. ఒంటరి అంటున్న జగన్… ఒంటరి పురుష పెన్షన్ అప్లై చేసుకోవాలని ఎద్దేవా చేసారు. సోమవారం వినుకొండ సభలో జగన్ మాట్లాడుతూ.. తోడేళ్లన్నీ ఒకటి అవుతున్నాయని..కానీ నేను సింహాల పోరాడుతానని అన్నారు జగన్. వెన్నుపోటు దారులకు, మీ బిడ్డ జగన్ కు మధ్య యుద్దం జరుగుతుంది.. మీ బిడ్డ కు పొత్తులు ఉండవు…ఒంటరిగా సింహం లా పోరాడతాడని చెప్పుకొచ్చారు. తోడేళ్ళు అందరు ఒక్కటైనా పేద ప్రజలు ఇచ్చిన బలం తో పోరాటం చేస్తానని అన్నారు. ఈ కామెంట్స్ ఫై అచ్చెన్నాయుడు స్పందించారు.

ఒంటరిగా ఉండడానికి.. వెలివేయడానికి చాలా తేడా ఉందని..సింహం డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని జగన్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు. తల్లిదండ్రుల్ని చంపేసి, జడ్జి ముందు నాకెవరూ లేరు, నాపై జాలి చూపమన్నట్లుంది జగన్ వైఖరి అని..తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి, నేను సింహాన్ని, సింగిల్ అనడం హాస్యాస్పదమన్నారు. పాపాలు, దారుణాలు, భారాలు భరించలేక అందరూ దూరం పెడితే సింగిల్ గా మిగిలావని..ఒంటరితనం భరించలేక ఫ్రష్టేషనుతో ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని ఆగ్రహించారు. ఒంటరి అంటూ దేబిరించే బదులు వెళ్లి ఒంటరి పురుష పెన్షన్ అప్లై చేసుకోవాలని..సినిమా డైలాగులు విని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చెత్త పాలన, చేవచచ్చిన ప్రసంగాల వినలేక ప్రజలు పారిపోతున్నారని..పోలీసులు, అధికారులు లేకపోతే సభల్లో ఉండేది జగన్ ఒక్కరేనని వెల్లడించారు.