కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 52 మంది మృతి

ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో అంటుకున్న మంటలు
మరో 67 మందికి తీవ్ర గాయాలు

ఇరాక్ : ఇరాక్‌లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 52 మంది సజీవ దహనమయ్యారు. నసిరియా పట్టణంలోని అల్-హుస్సేన్ కొవిడ్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి వార్డులను చుట్టుముట్టేశాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

కాగా, ఈ ఘటనలో మొత్తం 52 మంది ప్రాణాలు కోల్పోగా మరో 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క‌రోనా వార్డు 70 ప‌డ‌క‌ల‌తో 3 నెల‌ల క్రితం ప్రారంభ‌మైంది. మంట‌ల‌ను ఆర్పేందుకు అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా శ్ర‌మించింది. గాయ‌ప‌డ్డ రోగుల‌ను స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఇరాక్ ప్ర‌ధాన‌మంత్రి ముస్తాఫా ఆల్ కాధేమీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మినిస్ట‌ర్స్‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కారణాల‌ను విశ్లేషించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్స్ పేల‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించారు. చేయనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/