పుష్ప నుండి రష్మిక ఫస్ట్ లుక్ విడుదల

పుష్ప నుండి రష్మిక ఫస్ట్ లుక్ విడుదల

పుష్ప మూవీ నుండి రష్మిక తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఆసక్తి పెంచారు చిత్ర యూనిట్. ఈ మూవీ లో పుష్ప రాజ్ కు భార్య రోల్ శ్రీవల్లి గా రష్మిక కనిపించబోతుంది. అడవి ప్రాంతంలోని ఒక గిరిజన గూడానికి చెందిన యువతిగా ఆమె కనిపించబోతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది. చెవులకు దిద్దులుపెట్టుకుంటూ హడావిడిగా ఉన్నట్లు రష్మిక కనిపించింది.

ఈ చిత్ర మొదటి భాగాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నామని పోస్టర్ లో తెలిపారు. సుకుమార్ డైరెక్షన్లో పాన్ ఇండియా గా ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ , సాంగ్స్ సినిమా ఫై అంచనాలు పెంచేసాయి.