కేసీఅర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఉత్తమ్ ఫైర్

ప్రస్తుతం తెలంగాణ లో మునుగోడు ఉప ఎన్నికల వేడి కొనసాగుతుంది. అధికారపార్టీ టిఆర్ఎస్ నుండి ఎవర్ని బరిలో దింపుతారనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి , బిజెపి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే వీరు జోరుగా ప్రచారం చేస్తూవస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల బూత్ స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. ఇన్నాళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత గలిజు రాజకీయాలు చూడలేదన్నారు. 8 ఏండ్లు అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు అభివృద్ధికి చేసింది ఏమి లేదన్నారు. గత ఎన్నికలలో బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయో, ఇప్పుడు అన్నే పడతాయని జోస్యం చెప్పారు. మతతత్వ బీజేపీ, అవినీతి టీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.