వ్యాక్సిన్‌ ‌పై స్పందించిన ఆస్ట్రాజెనికా సీఈఓ

నిన్న నిలిచిపోయిన వ్యాక్సిన్ ట్రయల్స్

Astrazeneca CEO Pascal Soriot

లండన్‌: ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ చివ‌రి ద‌శ ప్రయోగాలు తాత్కాలింగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ స్పందించారు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ ఓ టెలీ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్న ఓ మహిళకు తీవ్రమైన నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్య వచ్చింది. ఆమెకు ఏమైందన్న విషయంలో ఇంతవరకూ ఎటువంటి నిర్ధారణకు రాలేదు.

కానీ ఆమె కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. వ్యాక్సిన్ సురక్షిత చాలా ముఖ్యమన్న సంగతి మాకు తెలుసు. పూర్తి సురక్షితమని తేలితేనే వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేస్తాం’ అని అన్నారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయడం ఇదే తొలిసారి కాదని, గత జూలైలో ఓ వాలంటీర్ కు కూడా ఇదే విధంగా నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చాయని, అప్పుడు కూడా ట్రయల్స్ ఆపామని, ఆపై వైద్యుల పరీక్షల్లో సదరు వాలంటీర్ కు వచ్చిన సమస్యలు వ్యాక్సిన్ వల్ల కాదని తేలిందని ఆయన స్పష్టం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/