పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభం

Hon’ble CM of AP will be Launching AP-Amul Project in West Godavari Virtually from Camp Office LIVE

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని సీఎం జగన్ శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశానని, లీటర్‌ పాల ధర కంటే లీటర్‌ నీళ్ల ధరే ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

‘‘ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్‌ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చాం. అమూల్‌ సంస్థలో వాటాదారులంతా పాలు పోసే అక్కాచెల్లెమ్మలు. పాలసేకరణలో చెల్లించే ధరలు.. మిగిలిన సంస్థల కంటే అమూల్‌ సంస్థలో ఎక్కువ. అమూల్‌ ద్వారా పాడిరైతులకు మంచి లాభాలు వస్తున్నాయి’’ అని సీఎం జగన్‌ అన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/