తిరుమల శ్రీవారి సన్నిధిలో మరోసారి చిరుత కలకలం..

తిరుమల భక్తులను చిరుతలు హడలెత్తిస్తున్నాయి. వరుసగా చిరుతలు ప్రతేక్ష్యం అవుతున్నాయి. ఇప్పటికే ఆరు చిరుతలు బాధించగా..తాజాగా మరో చిరుత కలకలం రేపింది. టీటీడీ ఇఓ ఇంటి సమీపంలో చిరుత సంచారాన్ని ట్రాప్ కెమెరాలు ద్వారా గుర్తించారు అటవిశాఖ అధికారులు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. ఇక ఈరోజు నుంచి రెండు రోజులు పాటు నడకదారిలో వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ బృందం పరిశీలన జరుపనుంది. నడకదారిలో ఇనుప కంచే ఏర్పాటుకు వున్న అవకాశాలను పరిశీలించనుంది వైల్డ్ లైఫ్ కమిటి. కమిటీ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చెయ్యనుంది కేంద్రం.

మరోపక్క ఈరోజు నుండి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పున : ప్రారంభం కానున్నాయి. నిన్నటి వరకు తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అయితే.. తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు నిన్నటి తో ముగిసాయి. ఇకపై తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక 55, 747 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 21774 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.