ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సీఎంగా ఇచ్చిన తొలి ఆదేశం ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈడీ కస్టడీ లో ఉన్న కేజ్రీవాల్ ..అక్కడి నుండే సీఎం గా తా బాధ్యతలు చేస్తున్నారు. ఈ తరుణంలో తన తొలి ఆదేశాన్ని జారీ చేశారు. దేశరాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఢిల్లీ మంత్రి ఆతిషీ ద్వారా ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనకు వారం పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈడీ ఆరోపణలను తోసిపుచ్చిన కేజ్రీవాల్..బీజేపీపై దుమ్మెత్తిపోశారు. రాజకీయ లక్ష్యాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారని మండిపడ్డారు. ఇక కేజ్రీవాల్ జైల్లో ఉన్నా ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ స్పష్టం చేసింది. దీంతో, జైల్లోని వ్యక్తి సీఎం బాధ్యతలు నిర్వర్తించవచ్చా? అన్న చర్చ మొదలైంది. న్యాయనిపుణుల ప్రకారం, విచారణ ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న వ్యక్తి సీఎం బాధ్యతలు నిర్వహించకూడదన్న చట్టం ఏదీ లేదు. అయితే, కఠినమైన జైలు నిబంధనలు ఇందుకు అడ్డంకిగా మారొచ్చని తెలుస్తోంది.