రేపు ఉదయం ‘పవర్ ప్యాక్’ అప్డేట్ రాబోతుంది

వకీల్ సాబ్ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..ప్రస్తుతం ఒకటి రెండు కాదు నాల్గు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి హరీష్ శంకర్ డైరెక్షన్లో. గతంలో వీరిద్దరి కలయికలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పవన్ కు గబ్బర్ సింగ్ ఊపిరి పోసింది. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో ఆలా చూపించి సక్సెస్ కొట్టాడు హరీష్.

ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. పవన్ 28 వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకోగా..రేపు (సెప్టెంబర్ 9) ఉదయం 9.45 నిమిషాలకు చిత్రం తాలూకా బిగ్ అప్డేట్ తెలియజేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత పవన్ కోసమే కథ సిద్ధం చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ మధ్యే పవన్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో వచ్చి ఆయనను కలిసాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి కాసేపు ముచ్చటించాడు.

అక్టోబర్ నుంచి ఈ మూవీ మొదలు కానుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం నెలకు 10 రోజులు డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు పవర్ స్టార్. హరీష్‌తో పాటు మిగిలిన దర్శకులు కూడా లైన్‌లో ఉండటంతో నెలకు 10 రోజులు కేటాయించబోతున్నాడు.