మలైకా గర్భం దాల్చడం ఫై అర్జున్ కపూర్ క్లారిటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా మరోసారి తల్లి కాబోతుందనే వార్తలు బాలీవుడ్ మీడియా లో చక్కర్లు కొట్టడం తో అంత నిజమే కావొచ్చని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈమె అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తప్ప అన్ని కానిస్తున్న ఈ జంట..తాజాగా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడం తో అర్జున్ కపూర్ క్లారిటీ ఇచ్చారు.

ఈ వార్తల్లో ఎంతఎం నిజం లేదన్నారు. చాలా సాధారణ విషయంలా మీడియా అంతటా స్ర్పెడ్ అయింది. ఇది అనైతికమైన చర్య. చెత్త వార్తలను ఇంకెన్నాళ్లు రాస్తారు. జర్నలిస్ట్ లు ఇలాంటి కథనాలను క్రమం తప్పకుండా రాస్తూనే ఉన్నారు. వాటి నుంచి మేమే తప్పించుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి వాటిని మేమ పెద్దగా పట్టించుకోం. కానీ కొన్నిసార్లు వాటిని తెలియని వారు నిజం అని నమ్మే ప్రమాదం ఉంటుంది. అందుకే మాట్లాడాల్సివస్తోంది. దయచేసి మా వ్యక్తిగత జీవితాల్లోకి రావొద్దు` అని రాసుకొచ్చారు. అలాగే మలైకా అరోరా సన్నిహితులు కూడా ఈ వార్తల్ని ఖండించారు. ఇది కేవలం నెట్టింట జరిగిన ప్రచారం మాత్రమే. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.