కిలో టమాటో రూ. 150కి చేరింది..

నిత్యావసర ధరలే కాదు కూరగాయల రేట్లు సైతం మండిపోతున్నాయి. మార్కెట్ లో ఏ కూరగాయలు చూసిన కేజీ వంద పలుకుతుంది. ఇక టమాటో ధర వంక చూస్తేనే వణుకుపుడుతుంది. ఈరోజు కేజీ టమాటో ధర ఏకంగా రూ.130 కి చేరింది. ఈ ధర చూసి వామ్మో టమాటోనా అని షాక్ అవుతున్నారు. టమాటో ధర చూసి సామాన్యులు వామ్మో అంటుంటే..రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీ రూపాయికి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు రూ. 130 కి కేజీ పలుకుతుండడం తో రైతన్నా సంబరాలు చేసుకుంటున్నారు.

టొమాటోకు కేరాఫ్ గా ఉన్న మదనపల్లి మార్కెట్ లో రికార్డ్ స్థాయి ధరలకు చేరింది. కిలో టమాటో రూ. 130కి చేరింది. హైదరాబాద్ లో కూడా కిలో టమాటో ధర రూ. 120-130 మధ్య ఉంది. చెన్నైలో అయితే కిలో టొమాటో ధర రూ. 150 చేరింది. చెన్నైలో కిలో టమాటోలకు బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఓ హోటల్ ప్రకటించడం వైరల్ గా మారింది. ఈ ఆఫర్ చూస్తే ప్రస్తుతం టమాటో డిమాండ్ ఏవిధంగా ఉందో తెలుస్తోంది. పెట్రోల్ ధరలను మించి టమాటో ధరలు పెరగడం సామాన్యుడికి కంటతడి పెట్టిస్తోంది. ఏ కూర అయినా టొమాటో లేకుండా కాదాయే.. దీంతో టమాటో ధర ఎంతైనా.. ఎంతో కొంత కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. ఇంతగా పెరగడానికి కారణం భారీ వర్షాలే అని అంటున్నారు. రాయలసీమ లో టమాటో సాగు ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటో పంట దారణంగా దెబ్బతింది. దీంతో సాగు, దిగుబడి తగ్గడంతో టమాటోలకు రికార్డ్ ధర లభిస్తోంది.